దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్నూలు బస్సు దుర్ఘటనలో మరణించిన వారిలో 19 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మూడు రోజుల అనంతరం ఎఫ్ఎస్ఎల్ నివేదికల ఆధారంగా 19 మృతదేహాల్లో 18 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా వారికి అందించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.

