
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధన్నా ప్రస్తుతం ఇండోర్‌లో ఉంది. ఇంగ్లండ్‌తో ఒక కీలకమైన ప్రపంచ కప్ మ్యాచ్ ఆడనుంది. దీనికి ముందు స్మృతి మంధన్నా ఇండోర్ కోడలిగా మారబోతోందనే వార్త వచ్చింది. ఈ వార్తపై స్వయంగా స్మృతి మంధన్నాతో పెళ్లి వార్తలు వినిపిస్తున్న పలాష్ ముచ్చల్ కన్ఫాం చేశారు. డిష్కియాన్, భూతనాథ్ రిటర్న్స్ వంటి చిత్రాలకు సంగీతం అందించిన 30 ఏళ్ల పలాష్, స్మృతి మంధానా మధ్య 2019 నుండి డేటింగ్ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.