
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడకు సంబంధించిన భూ వివాదంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 52, 53, 54, 59 సర్వే నంబర్లలోని 45.37 ఎకరాల భూములకు సంబంధించిన 17 సేల్ డీడ్ల రద్దు చెల్లదని జస్టిస్ కె.శరత్ స్పష్టం చేశారు. సబ్‌రిజిస్ట్రార్ జారీ చేసిన రద్దు ఉత్తర్వులు చెల్లవని తేల్చిచెప్పారు. ఈ భూమిని నిషేధిత జాబితాలో చేర్చినట్లు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకపోయినా.. సేల్ డీడ్లను రద్దు చేయడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.