
ఢిల్లీలోని బిషంబర్ దాస్ మార్గ్ లోని బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సభ్యులకు కేటాయించిన ఫ్లాట్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మూడో అంతస్తులో ఒకరికి కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.