
జూనియర్ స్థాయిలో అదరగొడుతున్న యువ క్రీడాకారిణులకు మాయా రాజేశ్వరన్, సహజ యమలపల్లి కి మరో మెగా టోర్నీ అవకాశం దక్కింది. స్వదేశంలో జరుగబోయే చెన్నై ఓపెన్లో ఇద్దరికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. డబ్ల్యూటీఏ 250 టోర్నీ చెన్నై ఓపెన్ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకూ జరుగనుంది. స్పెయిన్లోని రఫెన్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయా రాజేశ్వరన్ జూనియర్ లెవల్లో చెలరేగిపోతోంది. సహజ యమలపల్లి కూడా ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉంది.