
సీబీఐ వలకు మరో భారీ అవినీతి చేప చిక్కింది. రోపార్ రేంజ్ (పంజాబ్) డీఐజీ హర్చరణ్ సింగ్ భుల్లర్‌కు చెందిన ఇళ్లల్లో గురువారం సీబీఐ జరిపిన సోదాల్లో ఏకంగా రూ.5 కోట్ల నగదు, లగ్జరీ కార్లు, నగలు, ఖరీదైన వాచ్‌లు లభించాయి 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి భుల్లర్.. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. స్క్రాప్ డీలర్ ని, తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి తప్పుడు కేసులో ఇరికిస్తానని భుల్లర్ బెదిరించారని ఆరోపించారు.