
దేశంలో తీసుకువచ్చిన మూడు కొత్త క్రిమినల్ లా చట్టాలు న్యాయ లక్షంతో కూడుకున్నవే, అంతేకానీ శిక్షలే ప్రధాన ఉద్ధేశంతో ఉండేవి కావని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను 21వ శతాబ్ధంలో భారీ స్థాయిలో సంస్కరించే దిశలోనే ఈ మూడు చట్టాలు రూపొందాయి. అమలులోకి వచ్చాయని వివరించారు.కేంద్ర హోం మంత్రి సోమవారం జైపూర్‌లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ మూడు చట్టాల సమగ్ర స్వరూపం తెలిపే ఎగ్జిబిషన్‌ను ఆరంభించిన క్రమంలో ఆయన మాట్లాడారు.