H1-B వీసాపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత వీసాలకు, రెన్యువల్స్ కి తాజా ఫీజు పెంపు నిబంధన వర్తించదని వెల్లడించింది. కొత్తగా వచ్చే ఏడాది నుంచి జారీ చేయనున్న వీసాలకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. 2025 లాటరీ వీసాలకు సైతం పాత ఫీజులే వర్తిస్తాయని వెల్లడించింది. అయితే కొత్తగా హెచ్1 బి వీసాకు దరఖాస్తు చేసుకునే వారు లక్ష డాలర్ల ఫీజు జీవిత కాలానికి ఒకసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని స్పష్ఠీకరించింది

