అగ్రరాజ్యం అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. టెలికాం సర్వీసుల్లో సాంకేతిక సమస్య డల్లాస్ సహా మరో రెండు విమానాశ్రయాల్ల 1,800కిపైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. వందలాది విమానాలు రద్దయ్యాయి. ఎఫ్ఏఏ (FAA)తో సంబంధం లేని స్థానిక టెలిఫోన్ కంపెనీ పరికరాల్లో సమస్య కారణంగా సమస్య తలెత్తినట్లు ఎఫ్ఏఏ తెలిపింది. సమస్యను గుర్తించేందుకు టెలిఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది.

