నిన్నటి వరకు క్వింటాలుకు వేలల్లో ధర పలికిన ఉల్లి, ఇప్పుడు కిలోకు 30 పైసలకు పడిపోయింది. ఈ స్థాయి పతనం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నదాతలు వాపోతున్నారు. వెల్దుర్తి మండలం కోసనేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఉల్లి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.2 లక్షలతో ఉల్లి సాగు చేసిన రైతు రామచంద్రుడు.. ఉల్లి ధర దారుణంగా పడిపోవడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

