రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పురా బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఆ డెడ్‌బాడీ నగ్నంగా ఉండడంతో.. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏండ్ల వయసున్న యువతిని మూడు రోజుల క్రితమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

