వాయువ్య ఇంగ్లాండ్ లోని సౌత్పోర్ట్లోని ఓ డ్యాన్స్ స్కూల్లో దుండగులు కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు పిల్లలు మరణించిన ఘటనతో బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు కారకులు వలసదారులేనని అనుమానిస్తూ, వలస వ్యతిరేక వర్గాలు భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారి, దోపిడీలు, విధ్వంసానికి దారితీశాయి. లివర్పూల్, బ్రినటల్, బ్లాక్ పూల్, హల్, మాంచెస్టర్ వంటి అనేక నగరాల్లో ఆందోళనలు,
పలు చోట్ల దుకాణాలు, షాపింగ్ మాల్స్ ను లూటీ చేసి, ప్రభుత్వ భవనాలకు నిప్పంటించారు.

