కాంగ్రెస్ పార్టీ ఒక సంచలన వీడియోను విడుదల చేసి వివాదాన్ని రాజేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దివంగత తల్లి హీరాబెన్ పై ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రూపొందించిన ఒక వీడియోను విడుదల చేసింది.
అందులో ప్రధాని మోదీ కలలో ఆమె తల్లి కనిపించి.. మోదీ చేస్తున్న రాజకీయాలపై ఆయన్ను మందలిస్తున్నట్లుగా చూపించారు. దీంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని రాజకీయంగా అపహాస్యం చేసేందుకు కాంగ్రెస్ ఉపయోగించిందని ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ప్రకటించింది.

