బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఒక అబద్దాల అంబాసిడర్ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. కేటీఆర్ అబద్దాలు మానుకొని నిజాల మీద బతకాలని హితవు పలికారు. ములుగులోని మల్టి పర్పస్ వర్కర్ మైదం మహేష్ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్ వాడుకోవడం చాలా సిగ్గుచేటని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలో పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు రాక సమ్మెలు చేసిన రోజులు ప్రజలు మరిచిపోలేదని గుర్తు చేశారు.

