రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని ఆంక్షలు, ద్వితీయ సుంకాలు విధించగలిగితే మాస్కో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందని, అప్పుడుఅధ్యక్షుడు పుతిన్ను చర్చలకు వస్తారని చెప్పారు. రష్యాపై ఒత్తిడి పెంచడానికి అమెరికా సిద్ధంగా ఉందని, అయితే యూరోపియన్ భాగస్వాములు అందుకు సహకరించాలని వ్యాఖ్యానించారు.

