వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలతో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్..కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతించారు. ఈనెల 5వ తేదీ తర్వాత డేట్ ఫిక్స్ చేసుకోవాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి లేఖ రాశారు. పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు వివరాలు ఇస్తామని.. ఆ డబ్బుల్ని డిపాజిట్ చేయాలని ఎస్పీ జగదీష్ లేఖలో ప్రస్తావించారు..పెద్దారెడ్డి కూడా దీనికి అంగీకరించారు. పోలీసుల సూచనలు పాటిస్తా.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.

