భారత్ పై మరోసారి అమెరికా నోరు పారేసుకుంది. మోదీ.. జింపింగ్, పుతిన్లు కలవడం ఒక సిగ్గుమాలిన చర్య అని అమెరికా ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో స్పందించారు. మోదీ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం వెళ్లి ఇద్దరు డిక్టేటర్లను కలవడం ఏంటి? ఎప్పటికైనా మోదీ అమెరికాతోనే స్నేహం చేయాలి. రష్యా.. చైనాతో కాదు అని పేర్కొన్నారు. మొత్తానికి మోదీని నియంతల హగ్గర్ అని కూడా పిలిచారు. ఇదో పెద్ద సిగ్గుచేటుగా అయినా అభివర్ణించారు.

