చైనాలోని తియాన్‌జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ SCO ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ శిఖరాగ్ర సమావేశంలో సోమవారం ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సమావేశం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధ్యక్షతన జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా సదస్సు మూడు దేశాల అధినేతలు షెక్యాండ్ ఇచ్చుకొని, ఆలింగనం చేసుకున్నారు. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆత్మీయంగా పలకించారు.

