కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ (ZPTC) స్థానాల్లో జరిగిన ఇటీవల ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. పులివెందుల నుంచి బీటెక్ రవి అర్ధాంగి లతారెడ్డి, ఒంటిమిట్ట నుంచి ముద్దు కృష్ణారెడ్డి విజేతలుగా నిలిచారు. గెలుపొందిన లతారెడ్డి, ముద్దు కృష్ణారెడ్డి గురువారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ విజయాన్ని ఆయనకు అంకితం చేస్తూ, భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

