రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదని కోపించిన ట్రంప్ భారత్ పై 50శాతం సుంకాలను విధించింది. అయితే నిన్న అలాస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ జరిపిన చర్చలు అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఇప్పుడు కొత్త సుంకాలు విధించడాన్ని తాను పరిగణించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. మరో రెండు లేదా మూడువారాల్లో ఈ అంశాన్ని పునఃపరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. టారీఫ్ ల విషయం తాను కాస్త పక్కన పెట్టానని ట్రంప్ పేర్కొన్నారు.

