తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని మంత్రిని వందసార్లు కలిసినా ఫలితం లేకపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించక తప్పదన్నారు. ‘‘పదవులు మీరే తీసుకుంటున్నారు.. నిధులు కూడా మీరే తీసుకుంటున్నారని అడగాలా వద్దా?’’ తాను ముఖ్యమంత్రిని కానీ, పార్టీని కానీ విమర్శించడం లేదని,
మునుగోడు నియోజకవర్గానికి నిధులు రావడం లేదనే ఆవేదనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

