మెల్బోర్న్లోని కాన్సులేట్ కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకల నిర్వహణలో ఖలిస్థానీయులు రెచ్చిపోయారు. ఈ కార్యక్రమానికి అడ్డొచ్చి గందరగోళం సృష్టించారు. దేశభక్తి గీతాలు పాడుతుండగా కొందరు ఖలిస్థానీలు అక్కడికి వచ్చారు. ఖలిస్థానీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారతీయులు, ఖలిస్థానీ మద్దతుదారుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఖలిస్థానీ మద్దతుదారులపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. స్వాతంత్య దినోత్సం రోజున ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

