కన్నడ నటుడు దర్శన్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్‌కు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ క్రమంలోనే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు..
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును రద్దు చేస్తున్నట్లు తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్టం ముందు అందరూ సమానులేనని.. ఎవరూ అతీతులు కాదని తేల్చి చెప్పారు. దర్శన్‌ను తొందరగా అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

