తాజాగా సినీ కార్మికుల వేతన పెంపు విషయంపై నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు ముగిశాయి. అయితే ఈ చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ..
సినీ కార్మికుల వేతనాల అంశం ఇంకా కొలిక్కి రాలేదన్నారు. మరో రెండు మూడు సార్లు ఈ అంశంపై చర్చలు జరగాల్సి ఉందన్నారు. ఆ తర్వాత సమస్య పరిష్కారమయ్యే అవకాశమున్నట్టు చెప్పారు.

