జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది హస్తం పార్టీ. ముగ్గురు మంత్రులను ఇంచార్జిలుగా నియమించింది అధిష్టానం. జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు నేతలు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ మళ్లీ తనకే టికెట్ ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన అజారుద్దీన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. మైనారిటీ కోటాలో టికెట్ కేటాయించాలని వారికి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

