పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, కొత్తపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఏజెంట్లపై దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. తాను ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పటికీ, పోలీసులు దౌర్జన్యంగా తనను అరెస్ట్ చేశారని, ఇది అప్రజాస్వామిక చర్య అని అన్నారు.

