చాలామంది స్టార్స్ విమాన ప్రయాణాల సమయంలో గుర్తుపట్టకుండా మాస్కులు, క్యాప్‌లు వేసుకుని ముఖం కవర్ చేసుకుంటారు. అదే విధంగా, అల్లు అర్జున్ కూడా ముంబయి ఎయిర్‌పోర్టుకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించి ప్రయాణించాడు.
అయితే, చెకింగ్ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని వెంటనే గుర్తించలేకపోయారు. రూల్స్ ప్రకారం మాస్క్ తీయాలని ఆదేశించారు. దీంతో బన్నీ తన కూలింగ్ గ్లాస్ తీయగా కూడా ఆయనను గుర్తించలేదు. చివరికి మాస్క్ పూర్తిగా తీయగానే మాత్రమే అల్లు అర్జున్ అని గుర్తించి లోనికి అనుమతించారు.

