ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు విజయవాడలోని ఎన్నికల సంఘం (EC) కార్యాలయం ఎదుట ఆకస్మిక ధర్నాకు దిగారు. తమను ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి పోలీసులు అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగు నాగార్జునతో పాటు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, టీజేఆర్ సుధాకర్, కైలే అనిల్, పూనూరు గౌతమ్ పాల్గొన్నారు.

