‘మా’ అనుమతి లేకుండా ప్రదర్శనలు ఇచ్చే నటీనటులకు పారితోషికం లభించకపోతే, ఆ బాధ్యత ‘మా’ వహించదని మంచు విష్ణు స్పష్టం చేశారు. ఈ చర్య ద్వారా నటీనటుల హక్కులను కాపాడాలని, మధ్యవర్తుల ద్వారా జరిగే మోసాలను అరికట్టాలని ‘మా’ భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఆర్టిస్టుల పారితోషికాలు సకాలంలో అందే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సైమా అవార్డు ఫంక్షన్లో స్టార్ హీరోయిన్ కు పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఇలాంటి సంఘటనలు జరగకుండా కొత్త రూల్ను తీసుకొచ్చారు.

