రాష్ట్రంలో 20 నెలలుగా ప్రజా సమస్యలు పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని ఆరోపించారు. హరీశ్‌రావు మరో కీలక ఆరోపణ చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి చూపుతోందని వ్యాఖ్యానించారు. “గోదావరి మీద పోలవరం ప్రాజెక్ట్ మూడు సార్లు కూలిపోయింది కానీ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇవ్వలేదు. మేడిగడ్డపై మాత్రం రాష్ట్రం అడగకముందే రిపోర్టు ఇస్తూ బీజేపీ రాజకీయాలు ఆడుతోంది” అని ధ్వజమెత్తారు.

