భారత ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులను ఢిల్లీ కి ఆహ్వానించింది. ఈ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. దేశంలో ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, మరియు పార్టీలు ఈసీకి సమర్పించిన వివిధ అభ్యర్థనలపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వినోద్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరియు బాల్క సుమన్ హాజరుకానున్నారు.

