ఒక మేకప్ మ్యాన్‌గా కెరీర్ మొదలుపెట్టి, నిర్మాతగా, దర్శకుడిగా మారిన ఏ. ఎం. రత్నంగారికి నా బెస్ట్ ఇవ్వాలని కష్టపడ్డాను. అందుకే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ పదవికి ఏ. ఎం. రత్నం పేరుని నేనే ప్రతిపాదించాను.
నా సినిమా నిర్మాత అని కాదు. ఆయన తెలుగులో చాలామంది హీరోలతో సినిమాలు చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు. ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది.. అంటూ చెప్పుకొచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

