హైదరాబాద్‌లో గంజాయి వినియోగంపై ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్‌లో 15 మంది గంజాయి వినియోదారులు దొరికిపోయారు. సందీప్ డ్రగ్స్ విక్రయించేందుకు వినియోగించే ‘‘భాయ్ బచ్చా ఆగయా భాయ్’’ కోడ్‌తో పోలీసులు డ్రగ్స్ వినియోగదారులకు పంపించారు. గచ్చిబౌలిలోని గంజాయి విక్రయించే ప్లేస్‌కు రావాలని వారికి చెప్పారు. ఆ ప్రాంతంలో మఫ్టీలో మోహరించిన ఈగల్ టీమ్… ఈ ఆపరేషన్‌లో మొత్తం 15 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గంజాయి కోసం వచ్చి పోలీసులకు చిక్కారు. ఇంతమంది కేవలం రెండు గంటల వ్యవధిలోనే అక్కడికి రావడం గమనార్హం.

