కోట భౌతికకాయానికి నివాళులర్పించారు నటుడు బ్రహ్మానందం. కోట భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కోట శ్రీనివాసరావు మహానటుడని చెప్పారు. రోజుకు 18 గంటలు పనిచేసేవారని గుర్తుచేసుకున్నారు. కోట లేరంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు బ్రహ్మానందం. ఆయన భౌతికకాయానికి నటులు బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ నివాళులు అర్పించారు

