‘గేమ్ చేంజర్’ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి. ఇట్లు శిరీష్ రెడ్డి” అంటూ ఒక లెటర్ విడుదల చేశారు.

