హీట్ వేవ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక బ్రిటన్ ప్రజలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా లండన్‌లో రికార్డు స్థాయిలో టెంపరేచర్ 34 డిగ్రీలను దాటింది. హీట్ వేవ్ కారణంగా పొంచివున్న ముప్పు గురించి ఇంగ్లండ్, వేల్స్ సహా స్కాంట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ ప్రజలను నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈయూ దేశాలైన ఫ్రాన్స్, స్పెయిన్ కూడా హీట్ వేవ్‌తో సతమతమవుతున్నాయి. ఇలాంటి హీట్ వేవ్ 50 ఏళ్లలో ఒకసారి సంభవిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

