ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధు చేపట్టి భారతీయులను ఇరాన్ నుంచి తరలిస్తున్నది. ఇప్పటి వరకు 517 మంది భారత పౌరులను సురక్షితంగా తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో విద్యార్థులతో పాటు ఇతర పౌరులు ఉన్నారని పేర్కొంది.

