గత సంవత్సరం చెలరేగిన జాతుల మధ్య రగిలిన ఘర్షణలు, హింసాయుత ఘటనల నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోకముందే మళ్లీ మణిపూర్లో హింస రాజుకుంది. మైతీ తెగ రాడికల్ గ్రూప్ అరమ్బాయ్ తెన్గోల్-ATకి చెందిన ప్రముఖ నాయకుడు కనన్ సింగ్ సహా ఐదుగురు నాయకులను అరెస్ట్ చేయడంతో రాజధాని ఇంఫాల్ హింసాత్మకంగా మారింది. మైతీ తెగ యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

