
శ్రీవిష్ణు హీరోగా నటించిన మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో శ్రీవిష్ణు చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్ సైతం చెప్పారు. ఇక చివర్లో మంచు కురిసిపోతుంది అనే డైలాగ్ సైతం వచ్చింది. ఈ డైలాగ్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి. ఈ వివాదంపై రియాక్ట్ అవుతూ కొన్ని డైలాగ్స్ ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారి.. సింగిల్ టీమ్ తరపున క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై అలాంటివి రాకుండా చూసుకుంటాము. సారి అంటూ చెప్పుకొచ్చారు శ్రీవిష్ణు.