loader

కన్నప్ప టీమ్‏కు క్షమాపణలు చెప్పిన శ్రీవిష్ణు..

శ్రీవిష్ణు హీరోగా నటించిన మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో శ్రీవిష్ణు చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్ సైతం చెప్పారు. ఇక చివర్లో మంచు కురిసిపోతుంది అనే డైలాగ్ సైతం వచ్చింది. ఈ డైలాగ్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి. ఈ వివాదంపై రియాక్ట్ అవుతూ కొన్ని డైలాగ్స్ ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారి.. సింగిల్ టీమ్ తరపున క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై అలాంటివి రాకుండా […]

కులగణనపై క్రెడిట్‌ వార్‌.. వేడెక్కిన రాజకీయం..

కేంద్రం విపక్షాలపై పొలిటికల్‌ అస్త్రాన్ని ప్రయోగించింది. పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తామని ప్రకటించింది. కులగణనపై అధికార , విపక్షాల మధ్య క్రెడిట్‌ వార్‌ మొదలయ్యింది. కులగణన మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్మాత్మక నిర్ణయమని బీజేపీ నేతలు ప్రకటించారు. కులగణన పేరుతో కాంగ్రెస్‌ రాజకీయం చేసిందన్నారు.అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి మోదీ కులగణన చేపట్టారని బీజేపీ నేతలు ప్రశంసిస్తుంటే, ఇదంతా రాహుల్‌ కృషి అని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

పాకిస్థాన్ కు బిగ్ షాక్

దుష్టశక్తులైన ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ, వాటిని రక్షిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన విమానాలకు భారత గగనతలంలో ప్రవేశాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ప్రయాణికుల విమానాలతో పాటు మిలిటరీ విమానాలపై కూడా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టంచేశారు. మే 23 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.

నేటి నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు..

భారత రిజర్వ్ బ్యాంక్ షాకింగ్ ప్రకటన చేసింది. మే 1 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు పెంచుతున్నట్లు చెప్పింది. ఎందుకు అంటే.. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు పెరిగాయి, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువ అయ్యాయి అంటోంది. ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి మనీ విత్‌డ్రా చేస్తే, దానికి రూ.21 తీసుకునేవారు. మే 1 నుంచి.. రూ.23 తీసుకుంటారు. ఈ ఉచిత ట్రాన్సాక్షన్ల విషయంలో.. బ్యాంకుల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఏ బ్యాంకులో ఏ రూల్స్ ఉన్నాయో తెలుసుకొని, […]

ప్రతి పల్లెకూ రోడ్డు.. మండల కేంద్రానికి కనెక్టివిటీ

తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సైతం జాతీయ, రాష్ట్ర రహదారుల తరహాలో నాణ్యమైన రోడ్లను నిర్మించాలని రేవంత్ సర్కార్ సంకల్పించింది. ఇందులో భాగంగా.. తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో రాష్ట్రంలోని మండల కేంద్రాలను, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానిస్తూ మొత్తం 17,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్సల్టెన్సీ కంపెనీలు ఇప్పటికే 4,000 కిలోమీటర్ల పరిధిలో సర్వే పూర్తి […]

ఏపీకి రూ.172 కోట్లతో మరో కొత్త మాల్ వస్తోంది..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్‌నిర్మాణ పనులు ఈ నెల 2న ప్రారంభంకానున్నాయి. ప్రధాని మోదీ అమరావతి పనులతో పాటుగా మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో మరో కొత్త మాల్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో చేనేత, హస్తకళలను ప్రోత్సహించడానికి కేంద్రం యూనిటీ మాల్‌ను ఏపీకి మంజూరు చేసింది. ఈ మాల్‌ను విశాఖలోని మధురవాడలో రూ.172 కోట్లతో నిర్మిస్తారు.

అమెరికాలో ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్.

విద్యార్థి వీసాపై యూఎస్‌కు వచ్చిన 24 ఏళ్ల మహమ్మదిల్హామ్ వహోరా, హజియాలి వహోరా అనే ఇద్దరు భారతీయ యువకులను వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని అరెస్టు చేశారు. చికాగోలోని ఈస్ట్-వెస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఈ విద్యార్థులు.. వృద్ధులకు ఫోన్లు చేసి తాము ప్రభుత్వ ఏజెంట్లమని నమ్మబలికి.. వివిధ కేసుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసేవారు. భయభ్రాంతులకు గురిచేసి వారి నుండి క్రిప్టోకరెన్సీ ఏటీఎంల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయించి.. ఆపై దానిని నేరుగా […]

సింహాచలం ఘటనపై జగన్ సంచలన ఆరోపణలు

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. మీడియాతో మాట్లాడిన వైయస్‌ జగన్‌, రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “తెలిసి కూడా ఎందుకంత నిర్లక్ష్యం?” అని ప్రశ్నించారు. చందనోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి తెలియదా? అని నిలదీశారు. భక్తుల భద్రతకు సరైన ఏర్పాట్లు చేయకుండా, నిర్లక్ష్యంతో […]

పహల్గాం ఉగ్ర దాడి హతుని కుటుంబానికి రాహుల్ పరామర్శ

పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది వ్యక్తుల్లో ఒకరైన శుభం ద్వివేది కుటుంబ సభ్యులను కాన్పూర్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం పరామర్శించారు. రాహుల్ గాంధీ అమేథి నుంచి కాన్పూర్‌కు చేరుకుని ద్వివేది ఇంటికి వెళ్లారు. ఆయన ద్వివేదికి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మంగళవారం రాయబరేలి, అమేథిలలో రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు.

కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఏపీ స్వామీజీ

శ్రీ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ సన్యాస దీక్ష స్వీకరించారు. కుటుంబసభ్యుల సమక్షంలో తమిళనాడులోని కంచి పీఠంలో ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి సన్యాస దీక్ష ప్రసాదించారు.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ 1998లో జన్మించారు. అన్నవరంలో సంప్రదాయ వేద శిక్షణతో కర్నాటకకు చెందిన చందుకట్టు హోసమనే రత్నాకర భట్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON