పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం “దాడి చేసినా లేదా బెదిరించినా” దేశం తనను తాను రక్షించుకోవడానికి కలిసి నిలబడుతుందని అన్నారు. తాము రాజకీయం విభజించబడి ఉన్నప్పటికీ,
దేశం కోసం ఒక్కటిగా నిలబడుతామని అన్నారు. తమ మాతృభూమిని రక్షించుకోవడానికి పాకిస్తాన్ జెండా కింద కలిసి ఉంటామని ఎక్స్ వేదికగా ఫవాద్ పోస్ట్ చేశాడు. అయితే, ఈ పోస్టులో పహల్గామ్ దాడి గురించి ఎలాంటి సంతాపం కానీ, ఖండన కానీ, ప్రస్తావన కానీ చేయలేదు.

