లోధా డెవలపర్స్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ మాజీ డైరెక్టర్ రాజేంద్ర లోధాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్ కేసులో అతన్ని ఈడీ అదుపులోకి తీసుకున్నది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా ఉన్న సమయంలో రాజేంద్ర లోధా సుమారు 85 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎల్‌డీఎల్ కంపెనీకి కావాలనే ఆయన సుమారు 85 కోట్ల నష్టానికి కలగచేసినట్లు లోధాపై ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో క్రైం బ్రాంచ్ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు.

