పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా ఆమె ధ్వజమెత్తారు. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు స్వయంగా వాదనలు వినిపిస్తూ, ఎన్నికల సంఘం తీరుపై ఘాటు విమర్శలు చేశారు. బెంగాల్లో సుమారు 58 లక్షల ఓట్లను తొలగించడంపై మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, కోర్టులో ‘పార్టీ-ఇన్-పర్సన్’గా తానే స్వయంగా వాదనలు వినిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

