కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ… బండి సంజయ్‌కు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదని, అలాగే కనీస పరిజ్ఞానం కూడా లేదని విమర్శించారు. బండి సంజయ్ నిర్లక్ష్యంతో చేస్తున్న వ్యాఖ్యలు హద్దు మీరాయని కేటీఆర్ అన్నారు.బండి సంజయ్ 48 గంటల్లోగా చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే బండి సంజయ్‌ను కోర్టుకు లాగుతామని చెప్పారు. కేంద్రమంత్రిగా పనిచేయడమంటే ఢిల్లీ బాసుల చెప్పులు మోసినంత ఈజీ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

