గూగుల్ తన Q4 ఎర్నింగ్స్‌లో మొదటిసారిగా 400 బిలియన్ డాలర్లను అధిగమించిందని రిపోర్ట్ చేసింది. ఈ ఫలితాలకు సంబంధించిన వివరాలను ఒక అద్భుతమైన త్రైమాసికంగా పేర్కొంటూ, CEO సుందర్ పిచాయ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. “మా పార్ట్నర్స్ & ఉద్యోగులకు ధన్యవాదాలు, ఇది అద్భుతమైన త్రైమాసికం, మొదటిసారిగా వార్షిక ఆదాయం 400 బిలియన్ డాలర్లను దాటింది” అని పోస్టులో పేర్కొన్నాడు. “Well done ” అంటూ ఎలాన్ మస్క్ సుందర్ పిచాయ్ పోస్టుకు రిప్లై ఇచ్చారు

