డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కాళేశ్వరం నివేదిక పేరుతో రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అది కాంగ్రెస్ పార్టీ కమిషన్ అని, తాము ధర్నా చౌక్ వేదికగానే ఎత్తిచూపామని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కేసీఆర్ పేరును 36 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్లు కాదని ఆమె స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే నిర్మాణాలు జరిగాయని తెలిపారు.

