loader

ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా..

ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మేడ్చల్  77.31 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ బాలికలు (82.47%) బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా 73.04 శాతంతో మూడో స్థానంలో నిలిచి బాలికలు 78.72 శాతం పాస్ కాగా, బాలురు 66.72 శాతం మంది పాసయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేవలం 49.05 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఇక్కడ బాలుర ఉత్తీర్ణత చాలా తక్కువగా (28.03%) […]

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో టాప్ లేపిన మేడ్చల్.

2026 ఇంటర్మీడియట్ సెకండియర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా 58.69 శాతం ఉత్తీర్ణతో జాబితాలో చివరి స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 82.73 శాతం, ఇక్కడ మొత్తం 64,146 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 53,071 మంది ఉత్తీర్ణులయ్యారు. కేవలం 58.69 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ 3,149 మందికి గాను కేవలం 1,848 మంది మాత్రమే పాస్ […]

‘ఆశా భోస్లే గళం శాశ్వతం’.. లెజెండరీ సింగర్‌కు ప్రధాని మోదీ నివాళి

ఆశా భోస్లే అస్తమయం భారతీయ సంగీత రంగానికి ఎన్నటికీ తీరని లోటు అని పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించిన ప్రధాని మోదీ, ఆశా జీ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని రాసుకొచ్చారు. భారతదేశం గర్వించదగ్గ అత్యంత గొప్ప, బహుముఖ స్వరాల్లో ఆమె ఒకరని ప్రశంసించారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రయాణం మన సాంస్కృతిక వారసత్వాన్ని మరింత సుసంపన్నం చేసిందని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆమె […]

రైతన్నకు మిగిల్చిన బూడిద.. ఆకతాయిల అగ్గికి 22 ఏళ్ల మామిడి తోట దగ్ధం..

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో  విజయ భాస్కర్ రెడ్డి అనే రైతుకు 17 ఎకరాల  భారీ మామిడి తోట ఉంది. ఇందులో దాదాపు 22 సంవత్సరాల వయసు గల పెద్ద చెట్లు ఉన్నాయి. అయితే, శనివారం గుర్తు తెలియని దుండగులు తోటలో నిప్పు పెట్టారు. తోటలో ఎండు గడ్డి ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. మామిడి చెట్లు మంటల్లో చిక్కుకుని మాడిపోయాయి. చెట్లతో పాటు పొలంలో అమర్చిన ఖరీదైన డ్రిప్ పరికరాలు, పైపులు, తీగ జాతి మొక్కల […]

మా నాన్న తప్పు చేస్తే.. నన్నెందుకు ట్రోల్ చేస్తున్నారు..: మాచర్ల ASI కుమార్తె నందిని

పల్నాడు జిల్లా మాచర్లలో మ జంటల వీడియోల ఏఎస్సై కేసులో ఏఎస్సై కుమార్తె నందినిని కొందరు ట్రోల్ చేస్తున్నారు. పార్కుల్లో ప్రేమ జంటలు ఏకాంతంగా ఉన్న వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించి.. ఏఎస్సై అయిన తన తండ్రికి తాను చేరవేసినట్లు వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. డ్రోన్‌తో ప్రేమ జంటల వీడియోలు తీసి తన తండ్రికి ఇచ్చినట్లు ప్రూఫ్స్ ఉన్నాయా?.. ఒకవేళ ఉంటే అవి తీసుకొని తన దగ్గరకు రావాలన్నారు. తన పెళ్లికి సంబంధించిన వివాదాలు కూడా తన […]

ఆశా భోంస్లే 8 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన ఆశా… 8 దశాబ్దాల కెరీర్‌లో తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె కెరీర్ ఓసారి చూస్తే… 1933లో మహారాష్ట్రలోనే సాంగ్లీలో జన్మించిన ఆశా భోస్లే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టంతో పదేళ్ల వయసు నుంచే పాటలు పాడడం మొదలుపెట్టారు.

సీటెల్ నడిబొడ్డున స్వామి వివేకానంద భారీ విగ్రహావిష్కరణ!

1893లో చికాగో వేదికగా హిందూ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందుడి స్మారకంగా, 2026లో సీటెల్ నగరంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రఖ్యాత తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని అమెరికాలోని సీటెల్ నగరంలో ఘనంగా ఆవిష్కరించారు. ఒక అమెరికన్ సిటీ గవర్నమెంట్ అధికారికంగా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR) ఈ విగ్రహాన్ని సీటెల్ నగరానికి బహుమతిగా అందించింది.

శాస్త్రీయ సంగీతం నుంచి పాప్ వరకు.. ఆశా భోంస్లే సంగీత ప్ర‌స్థానం!

భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక ధ్రువతారగా వెలిగిన ఆశా భోంస్లే ప్రస్థానం అద్భుతం. ఆశా భోంస్లేది ఒక విలక్షణమైన శైలి. కేవలం మెలోడీలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆధునిక సంగీతానికి ఆమె గొంతు కొత్త ప్రాణం పోసింది. 20కి పైగా భారతీయ మరియు విదేశీ భాషల్లో సుమారు 12,000కు పైగా పాటలు పాడి, అత్యధిక స్టూడియో రికార్డింగ్స్ చేసిన గాయనిగా 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. భారత ప్రభుత్వం ఆమెను 2000లో దాదాసాహెబ్ ఫాల్కే […]

మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ పరీక్షల రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం ఏప్రిల్‌ 13వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల ఫీజు చివరి గడువును ఏప్రిల్‌ 20వ తేదీగా నిర్ణయించారు. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు, మే 22వ తేదీ నుంచి ప్రాక్టికల్స్‌ ప్రారంభం కానున్నాయి. రెండుసెషన్స్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ముగిసిన ‘స్వర’ ప్రస్థానం… దిగ్గజ గాయని ఆశా భోస్లే కన్నుమూత

భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో తన గళంతో అద్భుతాలు సృష్టించిన దిగ్గజ గాయని ఆశా భోస్లే (92) ఇకలేరు. గత కొన్ని రోజులుగా గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆమెను కుటుంబసభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు ఆమె కుమారుడు ఆనంద్ ఆదివారం వెల్లడించారు. ఆమె మరణవార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది.  వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON