loader

పుట్టింటికి వెళ్లా.. నా స్కూల్నీ చూశా: ఫొటోలు పంచుకున్న రష్మిక

“కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్లా. చిన్నప్పటి నుంచి వెళ్లే ఆలయాన్ని సందర్శించా. సమయాభావం వల్ల నేను చదివిన స్కూల్ని బయట నుంచే చూడాల్సి వచ్చింది. స్కూల్ని చూడగానే బాల్య జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. కుటుంబ సభ్యుల్లాంటి కొందరు స్కూల్ ఫ్రెండ్స్ని కలిశా. నా పెళ్లికి హాజరుకాలేకపోయిన కుటుంబ సభ్యులను కలిశా. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ నన్ను ఆశీర్వదించిన వ్యక్తులు వీరే. జీవితంలో ప్రతిదీ ఒక మంచి కారణం కోసమే జరుగుతుందని నాకు అనిపిస్తుంటుంది. ఆ కారణం […]

పోలీస్ శాఖలో రూ. 1.40 కోట్ల జీతాల కుంభకోణం బట్టబయలు

పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో గతంలో పే-సెక్షన్లో పనిచేసిన ఒక పోలీసు ఉద్యోగి మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి, IFMIS పోర్టల్ లో ఇతరుల పేర్లను చేర్చారు. నిందితుడు ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానించడం ద్వారా 2022 నుండి 2026 వరకు సుమారు రూ. 1,40,18,308 మేర ప్రభుత్వ జీతాల సొమ్మును అక్రమంగా పొందారు. SP ఆదేశాల మేరకు బాధ్యుడైన పోలీసు ఉద్యోగిపై క్రిమినల్ కేసులు నమోదు […]

అంతర్జాతీయ ప్రమాణాలతో పద్మావతి వర్సిటీ సాకారం

తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (ISO) గుర్తింపును సాధించి, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుందనీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమ తెలిపారు. ISO 21001:2018: విద్యా సంస్థల నిర్వహణ వ్యవస్థ, ISO 14001:2015: పర్యావరణ నిర్వహణ వ్యవస్థ,​ISO 50001:2018: ఇంధన నిర్వహణ వ్యవస్థ. ​విద్యా సేవలను అందించడంలో నాణ్యతకు గాను అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ సర్టిఫికేషన్ మరియు Q5 స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికేట్.

ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు – పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

సోషల్ మీడియాలో సాగుతున్న అరాచకాలు, వివాదాస్పద ఫ్లెక్సీలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలతో దూషించడం అంటే, ఆ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలీసుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుకౌట్ నోటీసుల రద్దు కేసులో తీర్పును రిజర్వ్ […]

కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీగా పోలింగ్

కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సాయంత్రం 5 గంటల తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాల్ని ఈసీ ప్రకటించింది. పుదుచ్చేరిలో అత్యధికంగా 86.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది అస్సాంలో 84.42 శాతం పోలింగ్ , కేరళలో 75.01 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలోసాయంత్రం 6 గంటలతర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ దాదాపు ప్రశాంతంగా సాగినప్పటికీ, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రంలో 2 లక్షల రేషన్ కార్డులు రద్దు.. ప్రభుత్వం ఊహకందని నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో  ప్రజా పంపిణీ వ్యవస్థను  మరింత పారదర్శకంగా మార్చాలనే లక్ష్యంతో, అనర్హులుగా ఉన్నవారిని గుర్తించి వారి కార్డులను తొలగించే ప్రక్రియను వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో జరిగిన ప్రాథమిక విచారణలో ఇప్పటికే లక్షమందికి పైగా అనర్హులు రేషన్ సౌకర్యాన్ని పొందుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో దాదాపు 2 లక్షల మంది Income Tax చెల్లింపుదారులు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు టిజి విజిలెన్స్ విభాగం నిర్వహించిన రహస్య ఆడిట్‌లో వెల్లడైందట.

బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ

రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా టీమ్‌తో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. బుమ్రా బౌలింగ్‌లో కొంత కంగారుపడినా.. తనకు అలవాటైన రీతిలో చెలరేగానని చెప్పాడు. ‘జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంత ఇబ్బందిగా ఏం అనిపించలేదు. నేను బుమ్రా కంటే ఎక్కువగా బంతిని చూసి ఆడాను. ఆరంభంలో బుమ్రాను చూడగానే కాస్త కంగారుపడ్డాను. కానీ నా సహజసిద్దమైన ఆటపై నమ్మకం ఉంచి.. బౌలర్ కంటే బంతిని మాత్రమే చూసి బాదేందుకు ప్రయత్నించాను.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది!

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 బి లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 6 గంటలకు విమానాశ్రయంలో కూర్చునే ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగింది. టెర్మినల్ లోపల ఉన్న కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్సులలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం టెర్మినల్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్‌కే పరిమితమైనట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే, ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, వార్డు సిబ్బంది మంటలను ఆర్పివేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

వైఎస్‌ను గుర్తు చేసుకుని ఏడ్చిన బొత్స – అచ్చెన్నాయుడు విమర్శలపై ఆగ్రహం

ప్రెస్ మీట్ లో బొత్స వైఎస్ గురించి మాట్లాడుతూ ఆయనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయాల్లో అందరూ నీలాగే ఉంటారనుకుంటావా అని అచ్చెన్నాయుడుపై బొత్స మండిపడ్డారు. కూటమి నేతలు సంస్కారం లేకుండా రాజకీయం చేస్తున్నారని.. విమర్శించారు. అచ్చెన్నాయుడు కావాలనే జగన్ పై బురదచల్లుతున్నారని ఆరోపించారు. ఆయన దిగజారుడు మాటలు మాట్లాడకపోవడం మంచిదన్నారు. రాజకీయాలను నీతిగా చేయాలని బొత్స సలహా ఇచ్చారు. మావిగన్ వస్తున్న స్పందనను చూసే.. డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు.

హోమ్ వర్క్ చేయలేదని ఇంత దారుణమా..? రెండో తరగతి విద్యార్థిపై స్కూల్ టీచర్ దాష్టీకం..!

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని విజ్ఞాన్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ సరిగా చేయలేదనే కారణంతో రెండో తరగతి చదువుతున్న చిన్నారిని టీచర్ తీవ్రంగా కొట్టాడు. విద్యార్థి నొప్పితో తల్లడిల్లితూ ఇంటికి చేరింది. చిన్నారి శరీరంపై గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి నిలదీశారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థినిని సంబంధిత టీచర్ వాతలు వచ్చేలా చితకబాదినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON