loader

ఏపీ పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

పంచాయతీల పునర్వర్గీకరణ నేపథ్యంలో ప్రభుత్వం గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శుల వేతనాల్లో మార్పులు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, వారి ప్రస్తుత పే-స్కేల్‌ను భారీగా తగ్గించారు. గతంలో వేతన నిబంధనల ప్రకారం వీరికి నెలకు రూ.28,280 నుంచి రూ.89,720 వరకు పే-స్కేల్ అమలవుతుండగా, తాజా సవరణతో దానిని రూ.25,220 నుంచి రూ.80,910కు కుదించారు. ప్రారంభ వేతనంలోనే సుమారు రూ.3,000 పైగా వ్యత్యాసం కనిపిస్తోంది, ఇది వారి భవిష్యత్తు ఇంక్రిమెంట్లు మరియు ఇతర అలవెన్సులపై […]

BJP వ్యవస్థాపక దినోత్సవంలో కార్యకర్తలకు మోదీ సందేశం

రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA) వంటి చారిత్రాత్మక నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు బీజేపీ కట్టుబడి పనిచేస్తోందని ప్రజలు గుర్తించారన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో బీజేపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని…  హింస రాజకీయ సంస్కృతి వల్ల బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు . పార్టీని తల్లిలా భావించే కార్యకర్తల […]

కాల్పుల విరమణ….లేనట్లే: ఇరాన్

మధ్యప్రాచ్య యుద్ధ విరమణ దిశలో మధ్యవర్తిత్వ దేశాలు ఈజిప్టు, పాకిస్థాన్, టర్కీలు రూపొందించి ఈ ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్‌లకు పంపించాయి. అయితే తాత్కాలిక యుద్ధ విరమణకు తాము అంగీకరించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యవర్తిత దేశం పాకిస్థాన్ ద్వారా అమెరికాకు తమ వైఖరిని తెలియజేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ సోమవారంనాడు రాత్రి ప్రకటించింది. ‘తాత్కాలిక కాల్పుల విరమణకు మేం సిద్ధంగా లేము. అని కైరోలోని ఇరాన్ […]

బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల మంది పేర్లు తొలగింపు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన విస్తృత సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి దాదాపు 90 లక్షల పేర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.  ఫిబ్రవరి 28న ప్రచురించిన తుది జాబితా నుంచి సుమారు 63 లక్షల పేర్లను తీసివేయగా.. విచారణ అనంతరం అదనంగా 27 లక్షల పేర్లను తొలగించారు. ప్రస్తుతం అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు పెండింగ్‌లో ఉన్న కేసులను ఈ ఎన్నికల జాబితాలో చేర్చబోమని, వాటిని తదుపరి ఎన్నికలలో […]

జమిలి ఎన్నికలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వన్ నేషన్-వన్ ఎలెక్షన్ విధానం కింద దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా ప్రణాళిక ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే దేశ ఆర్థిక వనరులు ఆదా అవుతాయని.. అలాగే నిరంతరం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆగిపోయే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని వివరించారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు – ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీపై జగన్ పగబట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాడికి మార్కెట్ యార్డ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో విమర్శించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్’గా మార్చేందుకు 1 లక్ష కోట్లు ఖర్చు చేస్తామని, అందులో ప్రభుత్వ వాటాగా 30 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. తాడిపత్రిలో రౌడీయిజానికి తావులేదని, అభివృద్ధికి మాత్రమే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి  ముఖ్యమంత్రికి రాజధాని  అమరావతి లోగోతో కూడిన ప్రత్యేక బ్యాడ్జ్‌ను బహుకరించారు.

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం – ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కీలకమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ రైతాంగం చిరకాల స్వప్నమైన తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రతి రెండు నెలలకోసారి జిల్లాకు వచ్చి […]

పవన్ కళ్యాణ్ పిఠాపురానికి కేంద్రం గుడ్ న్యూస్..!

పిఠాపురం రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూ.37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం,అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలో డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్, బెనిక్స్ మృతికి కారణమైన 9 మంది పోలీసు సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. ఈ ఘటనను అరుదైన కేసుగా పరిగణించిన కోర్టు, కస్టోడియల్ హింసపై కఠిన సందేశం ఇచ్చింది. కోవిడ్-19 లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మొబైల్ యాక్సెసరీస్ దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో జయరాజ్, బెనిక్స్‌లను పోలీస్ స్టేషన్‌లో నిరంతరంగా కొట్టడంతో తీవ్ర గాయాలు, బలమైన దెబ్బల వల్ల వారు […]

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తాం: రాహుల్ గాంధీ

పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. పుదుచ్చేరిని అక్కడి ప్రజలు నడపడం లేదని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతోందన్నారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON