కాంగ్రెస్, వామపక్షాలు.. అన్నింటినీ నాశనం చేస్తాయి: మోదీ
కాంగ్రెస్, వామపక్షాలు ఎక్కడ అధికారంలోకి వచ్చినా.. అన్నింటినీ నాశనం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేరళలోని పాలక్కడ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘బెంగాల్, త్రిపురలో వామపక్షాలు ఏం చేశాయో దేశమంతటికీ తెలుసు. కేరళ కూడా దుర్మార్గపు పథకాలతో నలిగిపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏం చేసిందో కూడా అందరూ చూశారు. హిమాచల్ ప్రదేశ్ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది.. ఇదీ కాంగ్రెస్ పాలన’’ అని మోదీ అన్నారు.

